మాచర్ల నియోజకవర్గం..యూ/ఏ!

99
nithin
- Advertisement -

ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మాచర్ల నియోజకవర్గం. ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో అందాల భామలు కృతి శెట్టి, కేథరిన్ త్రేజాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

తాజాగా సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది. సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. పక్కా కమర్షియల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని.. నితిన్‌తో పాటు ఇతర నటీనటులు ఈ సినిమాలో బాగా నటించారని అభినందించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా టీజర్స్, ట్రైలర్లు, సాంగ్స్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాకు మహతి స్వర సాగర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మరో మేజర్ అసెట్‌గా నిలవనుంది.

- Advertisement -