రెండోవిడత పంచాయతీ పోలింగ్‌..బారులు తీరిన ఓటర్లు

242
telangana polling
- Advertisement -

తెలంగాణ రెండో విడత పంచాయతీ పోరు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుండే ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

రెండవ విడతలో 4,135 గ్రామాల్లో ఎన్నికలు జరుగాల్సి ఉండగా, రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతోపాటు, కోర్టు కేసుల నేపథ్యంలో ఐదు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడంలేదు. రెండవ విడతలో మొత్తం 788 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,342 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుండగా, 10,668 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు.

మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా వార్డుస్థానాలు, ఆ తర్వాత సర్పంచ్‌స్థానాల ఓట్లను లెక్కిస్తారు.

- Advertisement -