ప్రియా వారియర్ టాటూ సిక్రెట్..

435
priya-prakash_
- Advertisement -

ఒకే ఒక చూపుతో కొద్ది రోజులు కుర్ర‌కారుకు నిద్ర‌లేకుండా చేసింది మ‌ల‌యాళ భామ ప్రియా వారియ‌ర్. ఆ ఒక్క విడియోతో ఓవ‌ర్ నైట్ సెల‌బ్రెటీ అయిపోయింది. ఆమె న‌టించిన చిత్రం ఒరు ఆడార్ ల‌వ్. ప్ర‌స్తుతం ఈసినిమా విడుద‌లకు సిద్ద‌మైంది. మ‌ల‌యాళంతో పాటు తెలుగులో కూడా ఈచిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ల‌వ‌ర్స్ డే పేరుతో ఈమూవీని తెలుగులో విడుద‌ల చేయ‌నున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుక‌గా ఫిబ్ర‌వ‌రి 14న ఈసినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.

lovers-day

ఈచిత్ర ఆడియో వేడుక నిన్న హైద‌రాబాద్ లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజర‌య్యారు. ఈ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ లో ప్రియా వారియ‌ర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచారు. ప్రియా వారియ‌ర్ ను చూసిన వారంద‌రి క‌న్ను ఆమె ఎద‌పై ఉన్న టాటూ పై ప‌డింది.

lovers-day

ఇక అది చూసిన కెమెరామెన్ లు  ఆమె టాటూ పై ఫోటోలు తీశారు. ఇప్పుడు ఆ టాటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘Carpe Diem అని ఆమె టాటూ వేయించుకుంది. ఇది లాటిన్ భాషకి చెందిన పదం. దీనికి అర్ధమేంటంటే.. ‘ఫ్యూచర్ మీద చిన్న ఆశ, నమ్మకంతో నేడు జీవించండి. మొత్తానికి ప్రియా టాటూ హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -