సిఎం కెసిఆర్ పిలుపుమేరకు ఎంపి సంతోష్ కుమార్ పేరిట చేపట్టిన అన్నదానం కరీంనగర్‌లో రెండో రోజు కూడా కొనసాగింది. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన వలస కూలీలు ఆకలి తీర్చేందుకు ఎంపీ సంతోష్ కుమార్ ముందుకు వచ్చి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
వలస కూలీలు పస్తులు పడుకోకుండా వారి కడుపు నింపారు. కరీంనగరంలోని 40వ డివిజన్ లో ఈఎన్ గార్డెన్ లో అన్నదాన కార్యక్రమాన్ని మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. స్థానిక కార్పోరేటర్ తో కలిసి బీహార్, మధ్యప్రదేశ్ నుంచి కూలీ పని కోసం కరీంనగర్ వచ్చిన వలసకూలీలకు మేయర్ స్వయంగా భోజనం వడ్డించారు. సీఎం కేసీఅర్ పిలుపు మేరకు ఎంపీ సంతోష్ కుమార్ వలస కూలీల కడుపు నింపేందుకు ముందుకు రావడం అభినందనీయమని మేయర్ సునీల్ రావు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వలస కూలీలకు ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యంతో పాటు 500 రూపాయల నగదు అందిస్తుందని తెలిపారు. సుమారు రెండు, మూడు వేల మంది వలస కార్మికుల కడుపు నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్ కు పేద ప్రజల దీవెనలు, సీఎం కేసీఅర్ అండదండలు ఎప్పుడు ఉంటాయని పేర్కోన్నారు.