నిజామాబాద్‌లో 18 పాజిటివ్ కేసులు నమోదు..

101
narayana reddy

నిజామాబాద్‌లో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల ఏరియాలో కంటెన్ మెంట్ గా చర్యలు చేపట్టామపి ప్రైమరీ కాంటాక్ట్ వారి శాంపిల్స్ కూడా పరీక్షల కోసం పంపిస్తున్నాం అన్నారు. ప్రజలు బయటకు రాకుంటేనే అందరికీ క్షేమం అన్నారు.

ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకుని అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తద్వారా ఈ వ్యాధి మరింత విస్తరించకుండా ఆపడానికి వీలవుతుందన్నారు.

పాజిటివ్ కేసులు నమోదైన వ్యక్తులు నివాసముండే ఎల్లమ్మ గుట్ట, హబీబ్ నగర్, ఆటోనగర్ ముజాహిద్ నగర్, అర్సపల్లి, వాల్మీకి నగర్, కంటేశ్వర్ మాక్లూర్ తదితర ప్రాంతాలలో కిలోమీటర్ల మేర యాంటీవైరస్ ద్రావణాన్ని పిచికారి చేయడంతోపాటు ఇంటింటి సర్వే నిర్వహించి అందరూ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నామని చెప్పారు.

ఈ ప్రాంతాలను కంటోన్మెంట్ ప్రాంతాలుగా ప్రకటించడానికి చర్యలు తీసుకుంటున్నామని.. ఎల్లమ్మ గుట్టలో ఒక వృద్ధుడు కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన అరగంటలోనే చనిపోయాడని తెలిపారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వవద్దని అన్ని మెడికల్ షాపులకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు.పాజిటివ్ వచ్చిన వారిలో ఐదుగురు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, మిగతావారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారురని తెలిపారు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సీపీ కార్తికేయ. బయట పనులకు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వారే వెళ్లాలని కుటుంబ పెద్దలు, మహిళలు బాధ్యత తీసుకొని ఎవరు కూడా తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్ళకుండా చూడాలన్నారు.

లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ లేదా…రెండు – మూడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామన్నారు.
ఇప్పటివరకు 19 వందల వాహనాలు సీజ్, 50 కేసులు బుక్ అయ్యాయని తెలిపారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు 80 మంది కాదు, 57 మాత్రమే అన్నారు.