రివ్యూ: సెబాస్టియన్ పి.సి.524

647
sebastian
- Advertisement -

టాలెంట్‌ ఉన్నోళ్లకు టాలీవుడ్‌ ఎప్పుడూ వెల్కమ్‌ చెబుతుంది. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరో కిరణ్ అబ్బవరం. తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపంతో మరో సాలిడ్ సక్సెస్ అందుకున్నారు. క్లాసు – మాసు, యూత్ – ఫ్యామిలీ… అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా ‘సెబాస్టియన్ పిసి 524’తో హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరి సెబాస్టియన్‌గా కిరణ్ ఆకట్టుకున్నాడా లేదా చూద్దాం..

కథ:

సెబాస్టియ‌న్ కు రేచీక‌టి. కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి పోలీస్ అవుతాడు. తన‌కు రాత్రి డ్యూటీ వేయ‌వ‌ద్ద‌ని ఇన్ స్పెక్ట‌ర్ ను అడుగుతాడు. అయినా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. సెబాస్టియ‌న్ కు రేచీక‌టి అన్న విష‌యం న‌లుగురికి మాత్ర‌మే తెలుసు. ఒక‌టి అత‌ని త‌ల్లి, రెండు అత‌ని చిన్న‌నాటి మిత్రుడు, అత‌నికి ట్రీట్ చేసే డాక్ట‌ర్, అత‌ని ప్రేయ‌సి. ఓ రోజు సెబాస్టియ‌న్ కు ఓ ఇంటి ద‌గ్గ‌ర డ్యూటీ వేస్తారు. అక్క‌డ ఓ అమ్మాయి చ‌నిపోతుంది. రాత్రి స‌రిగా క‌నిపించ‌ని సెబాస్టియ‌న్ ఉద‌యం పోలీసు అధికారుల ముందు దోషిగా నిలుస్తాడు. అత‌ని ఉద్యోగం పోతుంది. తర్వాత ఏం జరుగుతుంది…?అసలు దోషిని సెబాస్టియన్ ఎలా పట్టుకున్నాడు..?చివరకు కథ ఎలా సుఖాంతం అయిందనేదే సెబాస్టియన్ కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం న‌టన,కామెడీ,జిబ్రాన్ సంగీతం. క్రైమ్ డ్రామాలో సెంటిమెంట్ మిక్స్ చేసి మెప్పించే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఇక సెబాస్టియ‌న్ గా కిర‌ణ్ అబ్బ‌వ‌రం వందశాతం న్యాయం చేశారు. హీరోయిన్స్‌ కూడా తమ పరిధి మేరకు రాణించగా మిగితా నటీనటులు పర్వాలేదనిపించారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ చిన్న క‌థ‌ను సాగ‌దీయడం,న‌త్త న‌డ‌క‌గా సాగే క‌థనం, కొత్తదనం లేకపోవడం.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జిబ్రాన్ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్‌. ద‌ర్శ‌కుడు బాలాజీ సయ్యపురెడ్డి కథపై ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది. ఎడిటింగ్,సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు.

తీర్పు:

ఈ మ‌ధ్య కాలంలో జ‌నాన్ని ఆక‌ట్టుకున్న కుర్ర హీరోల్లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఒకరు. తాజాగా సెబాస్టియన్‌ పీసీ 524గా మెప్పించారు. ల‌వ్, సెంటిమెంట్, క్రైమ్ క‌ల‌గ‌లుపుగా తెరకెక్కగా కథ, కథనంపై మరింత దృష్టిసారిస్తే బాగుండేది. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో అందరికి నచ్చే మూవీ సెబాస్టియ‌న్ పి.సి.524.

విడుదల తేదీ:04/03/2022
రేటింగ్:2.5/5
నటీన‌టులు : కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌
సంగీతం: జిబ్రాన్
నిర్మాత‌లు: సిద్ధారెడ్డి, జ‌య‌చంద్ర రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: బాలాజీ స‌య్య‌పురెడ్డి

- Advertisement -