సీల్డ్ కవర్లకు ఇక ముగింపు..సుప్రీంకోర్టు

39
supreme
- Advertisement -

వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ బకాయిలను త్వరగా చెల్లించాలని సూచించారు. దీంతో పాటుగా సీల్డ్ కవర్‌లో సమర్పించడం లాంటి సంప్రదాయానికి ముగింపు పలకాలని అన్నారు. మేం ఎటువంటి రహస్య పత్రాలు సీల్డ్ కవర్లు తీసుకోం వ్యక్తిగతంగా నేను వాటికి వ్యతిరేకిని. న్యాయాస్థానాల్లో పారదర్శకత ఉండాలన్నారు. ఈ కేసులో రహస్యం ఏముందని మేమిచ్చిన ఆదేశాలు అమలు చేస్తున్నారు. నేను ఈ సీల్డ్‌ కవర్ సంప్రదాయానికి ముగింపు పలుకుదామని అనుకుంటున్నాను అని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. దీంతో కింది స్థాయి కోర్టులు కూడా ఇదే విధంగా అనుసరిస్తాయని పేర్కొన్నారు. ఎవరి జీవితానికైనా ప్రమాదం కలుగుతుందంటే విశ్వసనీయ సమాచార మూలాల గురించి చెప్పేటప్పుడు ఈ పద్ధతిని అనుసరించవచ్చని సూచించారు.

వన్‌ర్యాంక్ వన్‌ పెన్షన్ బకాయిలను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామంటూ రక్షణ మంత్రిత్వ శాఖ జనవరిలో ఇచ్చిన సమాచారాని తక్షణం వెనక్కు తీసుకోవాలని ఈ నెలలో కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 30లోగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు అవార్డులు గెలుచుకున్నవారికి ఓకే ఇన్‌స్టాల్‌ మెంట్‌లో బకాయిలు చెల్లించాలని సూచించారు. దీంతో పాటుగా జూన్‌30నాటికి 70యేళ్లు పైబడిన పెన్షనర్లకు అలాగే మిగతా అర్హులైన పెన్షనర్లకు మూడు వాయిదాల్లో ఫిబ్రవరి 28,2024నాటికి ఆ మొత్తాన్ని చెల్లించాలి అని సూచించింది.

అయితే ప్రభుత్వం తరపున కేంద్ర అటార్నీ జనరల్‌ మాట్లాడుతూ బడ్జెట్‌ ప్రణాళిక ప్రకారం..ఇంత మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం సాధ్యం కాదు అని తెలిపారు. వనరులు పరిమితంగా ఉన్నాయి. ఖర్చును నియంత్రాల్సి ఉందని వివరించారు.

ఇవి కూడా చదవండి…

భారతదేశ విభజన ఎన్నిసార్లు జరిగిందో తెలుసా?

భారత హై కమిషన్ ఆఫీస్‌పై దాడి..

మోడీజీ.. ఈ ప్రశ్న మీకే !

- Advertisement -