బలగం @ 17 కోట్లు

43
- Advertisement -

దిల్ రాజు ప్రొడక్షన్ బేనర్ పై వేణు దర్శకుడిగా పరిచయమైన ‘బలగం’ నైజాంలో మంచి రెవెన్యూతో ముందుకెళ్తుంది. మొదటి రోజు తక్కువ కలెక్షన్స్ తో ఓపెన్ అయిన ఈ సినిమా మెల్ల మెల్లగా రోజు రోజుకి రెవెన్యూ పెంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా 17 కోట్ల గ్రాస్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

నిజానికి బలగం సినిమాకు అయిన కోటిన్నర నుండి రెండు కోట్లు. ఈ సినిమాను చాలా తక్కువ ఖర్చుతో తెలంగాణా పల్లెల్లో ఘాట్ చేశారు. దీంతో సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ అనిపించుకుంటుంది. నాన్ థియేటర్ , థియేట్రికల్ రెండూ కలిపి ఈ సినిమా దిల్ రాజు మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చింది.

దర్శకుడు వేణు కి సక్సెస్ తో పాటు అభినందనలు , ప్రశంసలు కూడా దక్కాయి. తెలంగాణా సంస్కృతి , సాంప్రదాయాలతో పిట్ట ముట్టుడు కథతో వచ్చిన ఈ సినిమా నైజాంలో మంచి కలెక్షన్స్ సాదిస్తుంది. ప్రస్తుతం టీం ఆంధ్రాలో ప్రమోషన్ మొదలు పెట్టారు. అక్కడ టూర్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్ తో ఆంధ్రలో కూడా సినిమా పికప్ అయితే మరింత రెవెన్యూ వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి…

‘ఉగ్రం’నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీ..

విశ్వక్ సేన్ 10..గ్రాండ్ లాంఛ్

విలన్ కోసం వేట ముమ్మ‌రం!

- Advertisement -