రవీంద్ర భారతీలో స్క్రిప్ట్ సాఫ్ట్‌వేర్ వ‌ర్క్‌షాప్

31
ravindra bharathi

భాషా సాంస్కృతిక శాఖ‌, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వ‌ర్యంలో జూలై 24 వ తేదీన య‌ువ ర‌చ‌యిత‌లు, దర్శకులకు స్క్రిప్ట్ సాఫ్ట్‌వేర్ స్కిల్ వ‌ర్క్‌షాప్ నిర్వ‌హించ‌నున్న‌ట్టు సంచాల‌కులు మామిడి హ‌రికృష్ణ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఈ సంద‌ర్భంగా హ‌రికృష్ణ మాట్లాడుతూ ప్ర‌స్తుత త‌రుణంలో ఏ ఓటీటీ ప్లాట్‌ఫాం అయినా ముందుగా స్ర్కిప్ట్‌ను టింగ్లిష్‌, ఇంగ్లీష్ ఫార్మాట్‌లో CELTX, FINAL DRAFT SOFTWARE ఫైల్ రూపంలో అడుగుతుంది. దానికితోడు యువ‌ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌ల ద‌గ్గ‌ర ఎన్నోగొప్ప‌, మంచి క‌థ‌లు ఉన్నా WRITNG SOFTWARE ల‌పై క్షుణ్ణ‌మైన అవ‌గాహ‌న లేక‌, స‌రైన ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌లేక అవ‌కాశాలు కోల్పోతున్నారు. ఫైన‌ల్ డ్రాఫ్ట్‌, CELTX త‌దిత‌ర డాక్యుమెంట్ ఫైల్ రూపంలో క‌థ, సినాప్‌సిస్‌, క‌థ‌నం ఒక ఫైల్ ఫార్మాట్ మ‌రియు PITCH BOOK ని ఎలా చేసుకోవాలి అనే అంశాల‌పై యువ‌త‌కు వ‌ర్క్‌షాప్ ద్వారా ఒక రోజు శిక్ష‌ణ అందించ‌నున్నాం అని తెలిపారు.

ఈ విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి అనుభ‌వ‌జ్ఞులైన‌ ప్రొఫెస‌ర్ ర‌ఘునాథ్ స‌ముద్రాల వివ‌రిస్తారని అలాగే ఈ కార్యక్రమానికి దర్శకులు కరుణకుమార్ గౌరవ అధితి గా హాజరవుతారని హరికృష్ణ తెలిపారు. అలాగే కోవిడ్ దృష్ట్యా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 30 మంది అభ్య‌ర్థుల‌కు మాత్ర‌మే ఈ అవ‌కాశం క‌ల్పించాల‌ని నిర్ణ‌యించాం. కాబ‌ట్టి య‌ువ ర‌చ‌యిత‌లు, దర్శకులు జూలై 21రోజు ఉద‌యం ప‌ది గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల‌లోపు 6300511367 నంబర్ ద్వారా సంప్ర‌దించ‌గ‌ల‌రని వెల్లడించారు.