బాలయ్యకు విలన్‌గా నటిస్తున్నా: శ్రీకాంత్

30
srikanth

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు హీరో శ్రీకాంత్. ఈ సందర్భంగా స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీకాంత్…ఫస్ట్ టైం బాలయ్య పక్కన విలన్‌గా నటిస్తున్నానని అఖండ సినిమాలో ఇదే హైలైట్ కానుందని తెలిపారు . అంతకముందు రామ,లక్ష్మణులుగా చేసిన వాళ్లం ఇప్పుడు విలన్‌గా తలపడబోతున్నామని తెలిపారు శ్రీకాంత్. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని…ఫస్ట్ టైం మంచి పాత్ర దొరికిందని తెలిపారు. ఓ కన్నడ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు శ్రీకాంత్.

కరోనా తర్వాత శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని…. అందరికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని శ్రీవారిని కోరానని తెలిపారు. కరోనా నుండి త్వరగా బయట పడాలని …ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనసరిగా పెట్టుకోవాలన్నారు.