తొలిసారి టీ20 వరల్డ్ కప్‌లో స్కాట్లాండ్

191
scotland
- Advertisement -

టీ20 వరల్డ్ కప్ తొలిసారిగా ఆడనుంది స్కాట్లాండ్. ఊహించని విధంగా క్వాలిఫైయింగ్ టోర్నీలో బంగ్లాదేశ్‌కు షాకిచ్చిన స్కాట్లాండ్…తర్వాత ఒమన్, పవువా న్యూ గినియాలపై గెలిచి గ్రూప్-బిలో టాప్‌లో నిలిచి టీ20 వరల్డ్‌కప్ సూపర్-12కి అర్హత సాధించింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 20 ఓవర్లలో 122 పరుగులకి ఆలౌటైంది. అకిబ్ లైస్ (37: 35 బంతుల్లో 3×4, 2×6) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మక్సూద్ (34: 30 బంతుల్లో 3×4, 1×6), మహ్మద్ నదీమ్ (25: 21 బంతుల్లో 2×6) విలువైన పరుగులు చేశారు.

123 పరుగుల ఛేదనలో స్కాట్లాండ్ కెప్టెన్ కైల్ కూజెర్ (41: 28 బంతుల్లో 2×4, 3×6) దూకుడుగా ఆడగా మాథ్యూ క్రాస్ (26: 35 బంతుల్లో), బెర్రింగ్టన్ (31: 21 బంతుల్లో 1×4, 3×6) రాణించడంతో 17 ఓవర్లలోనే 123/2తో లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన స్కాట్లాండ్ పాయింట్ల పట్టికలోనూ టాప్‌లో నిలిచింది. దీంతో గ్రూప్ బీ నుండి స్కాట్లాండ్‌తో పాటు బంగ్లాదేశ్ సూపర్-12కి అర్హత సాధించాయి.

- Advertisement -