నాగబాబుపై కోట సంచలన కామెంట్స్

129
kota
- Advertisement -

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు కోట శ్రీనివాసరావు. ఇటీవలె అనసూయ డ్రెస్సింగ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసిన కోట, తర్వాత ప్రకాశ్‌ రాజ్‌ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో సీన్‌లోకి నాగబాబు ఎంట్రీ ఇచ్చి కోట వ్యాఖ్యలను తప్పుబట్టారు.

దీనికి కంటిన్యూ ఎపిసోడ్‌గా నాగబాబుపై షాకింగ్ కామెంట్స్ చేశారు కోట. మెగా బ్రదర్ అనే గుర్తింపు తప్ప ఆయన కంటూ ఓ స్థానమే లేదన్నారు. అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ లేకపోతే నాగబాబు నథింగ్ అంటూ కోట చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. మరి దీనిపై మెగాబ్రదర్ ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.

‘మా’ ఎన్నికల సమయంలో తెలుగు వాళ్లకు మాత్రమే మా అసోసియేషన్ పీఠంపై కూర్చునే హక్కు ఉందని ప్రకాష్ రాజ్ పై విమర్శలు చేశారు కోట. దీనికి స్పందించిన నాగబాబు …కోట ఏజ్ పెరిగినా మాట తీరు మారడం లేదని చురకలు అంటించారు.

- Advertisement -