బ్రిటన్‌లో పెరిగిపోతున్న కరోనా..

143
britan covid
- Advertisement -

బ్రిటన్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా తాజాగా 52,009 మంది కరోనా సోకగా 115 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సఖ్య 86,41,221కి చేరగా 1,39,146 మంది మృతిచెందారు.

కరోనా మహమ్మారి ప్రమాదం ఇంకా తొలగిపోలేదని…దేశంలో కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయని, పరిస్థితిని నిషితంగా గమనిస్తున్నామని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటించారు. దేశంలో 12 ఏండ్లు అంత కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు 86 శాతం మంది వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నారని, సుమారు 79 శాతం మంది రెండు డోసులు అందుకున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయని చెప్పారు.

- Advertisement -