వరల్డ్ కప్ క్వాలిఫయర్ నుండి జింబాబ్వే ఔట్ అయింది. దీంతో రెండో బెర్తు కోసం స్కాట్లాండ్, నెదర్లాండ్ మధ్య పోటీ జరగనుంది. స్కాట్లాండ్ తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో జింబాబ్వే చేతులేత్తేసింది. దీంతో వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేకపోయింది జింబాబ్వే.
పాయింట్ల పట్టికలో జింబాబ్వే ఆరు, స్కాట్లాండ్ ఆరు పాయింట్లతో, నెదర్లాండ్స్ నాలుగు పాయింట్లతో ఉన్నాయి. గురువారం స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లు తమ చివరి మ్యాచ్ ఆడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ విజయం సాధిస్తే మెగా టోర్నీకి శ్రీలంక జట్టుతో అర్హత సాధిస్తుంది. ఒకవేళ నెదర్లాండ్స్ జట్టు విజయం సాధిస్తే రెండు జట్లు ఆరేసి పాయింట్లతో సమానంగా ఉంటాయి. అప్పుడు నెట్ రన్‌రేట్‌లో స్కాట్లాండ్ ను నెదర్లాండ్స్ అధిగమిస్తేనే మెగా టోర్నీకి నెదర్లాండ్స్ జట్టు అర్హత సాధించిస్తుంది.
Also Read:తెలంగాణకు చేయూతనివ్వండి:నిరంజన్ రెడ్డి
వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా స్కాట్లాండ్ వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తుంది. నెదర్లాండ్ వన్డే వరల్డ్ కప్ 2023కు అర్హత సాధించాలంటే స్కాట్లాండ్ పై భారీ విజయాన్ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక మంగళవారం జింబాబ్వే, స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఫలితంగా వరుసగా రెండోసారి మెగాటోర్నీలో ఆడే అవకాశాన్ని కోల్పోయింది.
Also Read:పొటాటో జ్యూస్‌తో ఆ సమస్యలు దూరం..!