తెలంగాణలో కరోనా తీవ్రత తగడంతో లాక్‌డౌన్ ఎత్తివేత వేసింది ప్రభుత్వం. జూన్ 19 వరకు అమల్లో వున్న లాక్ డౌన్‌ను రేపటినుంచి (జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. కాగా అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తి స్థాయి సన్నద్ధతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని కేబినెట్ విద్యాశాఖను ఆదేశించింది. శనివారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
విద్యా సంస్థలు పున: ప్రారంభం అవుతున్ననేపథ్యంలో… విద్యార్ధుల తప్పనిసరి హాజరు, ఆన్ లైన్ క్లాసుల కొనసాగింపు, తదితర నిబంధనలు, విధి విధానాలకు సంబంధించిన ఆదేశాలను.. త్వరలో విడుదల చేయాలని విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది. విద్యాసంస్థల పున: ప్రారంభం విషయంలో చాలా క్లారిటీగా సమాచారం వుంది. ఇందులో అయోమయానికి ఎటువంటి తావు లేదు. విద్యాసంస్థలు ఫిజికల్ గానే పున: ప్రారంభం అవుతాయి. విద్యార్ధుల ఆన్ లైన్ క్లాసులు కొనసాగించడం, తప్పనిసరి హాజరు తదితర నిబంధనలు విధి విధానాలకు సంబంధించి పూర్తిస్థాయి ఆదేశాలను త్వరలో విడుదల చేయాలని విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది.
ప్రజా జీవనం, సామాన్యుల బతుకు దెరువు దెబ్బతినొద్దనే ముఖ్య ఉద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయానికి ప్రజల సహకారం కావాలని కేబినెట్ కోరింది. లాక్ డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పని సరిగా మాస్క్ ధరించడం తదితర కరోనా నియమావళిని అనుసరించాలని కేబినెట్ కోరింది.