ప్ర‌భుత్వ‌ పాఠశాల విద్యార్థి రికార్డు.. మంత్రి అభినందనలు..

133
errabelli
- Advertisement -

పాలకుర్తి మండలం చెన్నూర్ గ్రామ ప్ర‌భుత్వ‌ పాఠశాల విద్యార్థి మరాఠీ అరవింద్‌ ఇంట‌ర్నేష‌న‌ల్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించిడంతో ఆ విద్యార్థిని స‌న్మానించి, అభినందించారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అరవింద్ ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం గల 195 దేశాలు, వాటి రాజధానుల పేర్ల‌ను 02నిమిషాల‌ 12 సెకెన్ల‌లో చెప్పి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించాడు. అంతకు ముందు ఉన్న 2ని. 29 సె.లను అధిగమించి కొత్త రికార్డ్ సృష్టించాడు. అరవింద్ 15 రోజుల ముందు 2 ని 28 సెకెన్ల‌లో చెప్పి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు విద్యార్థిని సన్మానించి, మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకోవాల‌ని ఆశీర్వ‌దించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌భుత్వం ప్రభుత్వ పాఠ‌శాల‌లో అన్ని వ‌స‌తులు క‌ల్పించి, విధ్యార్థుల‌కు మెరుగైన విద్యను అందిస్తున్నద‌ని అన్నారు. అన్ని వ‌ర్గాలు ప్ర‌భుత్వ విధ్యాసంస్థ‌ల‌ను ఉప‌యోగించుకోవాల‌ని సూచించారు.

- Advertisement -