Priyanka Chopra:స్కూల్‌ బాత్‌రూంలో తినేదాన్ని

52
- Advertisement -

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా తన జీవితంలో జరిగిన సంఘటనలను తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వెల్లడించారు. హైస్కూల్‌ విద్య కోసం యూఎస్‌కు వెళ్లిన ప్రియాంక అక్కడి కష్టాలను చెప్పుకొచ్చింది. ఇటీవలే సీటాడెల్ వెబ్‌సిరీస్‌ విడుదలైన సందర్భంగా ఓ అంతర్జాతీయ మీడియాలో ఇంటర్వ్యూ ఇస్తూ పలు ఆసక్తికరమైన అంశాలను వివరించింది.

హైస్కూల్‌లోని క్యాంటిన్‌కు వెళ్లి ఫుడ్ ఎలా తీసుకోవాలో తెలీదని అన్నారు. వెండింగ్ మిషన్ నుంచి స్నాక్స్ తీసుకని… ఎవరూ చూడకుండా బాత్‌రూమ్‌లోకి వెళ్లి తిని వెంటనే క్లాస్‌రూంకి వెళ్లేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఇది చాలా రోజలు పాటు వేరే వాళ్లతో కలిసి తిరగలేదు. నాకున్న భయంతోనే నేను అలా ప్రవర్తించాల్సి వచ్చిందన్నారు. ఇలా సూమారు మూడు నాలుగు వారాల పాటు అక్కడి విషయాలను గమనించిన తర్వాత అందరితో కలసిపోయేదాన్ని అన్నారు.

Also Read: Saindhav:జాస్మిన్‌గా ఆండ్రియా జెర్మియా

స్కూల్‌లో ఉన్న ఇతర పిల్లలతో ఫ్రెండ్‌షిప్‌ కోసం నేను ఎంతో మారాను. ఫ్రెండ్స్‌తో కలిసి డేట్‌కు వెళ్లడం లేట్‌ నైట్‌ పార్టీలు…ఇలాంటివి మా ఇంట్లో అనుమంతించరని నా ఫ్రెండ్స్‌కు అర్థమయ్యేలా చెప్పాను అని ప్రియాంకా చోప్రా వెల్లడించారు. ఇటీవలే తను నటించిన సిటాడేల్‌ వెబ్‌సిరీస్‌ విడుదలైంది.

Also Read: ఉగ్రం…టైటిల్ సాంగ్ విడుదల

- Advertisement -