సింగరేణిలో ఎన్నికల నగారా మోగనుంది. ఏప్రిల్ 2న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలకు సంబంధించిన ఈ సమావేశానికి 32 కార్మిక సంఘాలను ఆహ్వానించగా, 15 సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరయ్యారు.
కార్మిక సంఘాల ఎన్నికల కాల పరిమితి 4 సంవత్సరాలు ఉండాలని టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంస్ కోరాయి. ఇది తమ పరిధిలో లేదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు.సీఐటీయూ, బీఎంఎస్ సంఘా లు మాత్రం రెండేండ్ల కాలపరిమితికి అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నాయి.
కాంట్రాక్ట్ కార్మికులకు ఓటు హక్కు కల్పించాలని కొన్ని సంఘాలు కోరినప్పటికీ అది సాధ్యపడదని, పర్మినెంట్ కార్మికులకు సంబంధించి ఎన్నికలు జరుగుతాయని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరపాలని ఈ సందర్భంగా కార్మిక సంఘాలు కోరాయి. 45 రోజుల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండటంతో మే చివరి వారంలో సింగరేణిలో గుర్తింపు సం ఘం ఎన్నికలు జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి..