యూపీఐ పేమెంట్ల డైలీ లిమిట్ మార్పు?

50
- Advertisement -

రోజువారి జీవనంలో డబ్బు ఎంతో ప్రాధాన్యం అయిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఎక్కడో ఏదో సందర్భంలో డబ్బుతో పని ఉంటుంది. అయితే ప్రతీ లావాదేవీ లిక్విడ్ క్యాష్‌తో కాకుండా యూపీఐ పేమెంట్లు వచ్చిన దగ్గరి నుండి కొంత చెక్ పడింది. దీంతో ఇన్‌స్టంట్‌గా నగదును బదిలీ జరుగుతుండటంతో అందరికి సులభమైంది.

అయితే తాజాగా యూపీఐ పేమెంట్లపై ప్రభుత్వం పరిమితి విధించింది. డైలీ లిమిట్ దాటితే పేమెంట్ చేయలేరు. ఎన్‌పీసీఐ మార్గదర్శాకాల ప్రకారం యూపీఐ ద్వారా ఒక వ్యక్తి గరిష్టంగా రూ.1లక్షవరకు చెల్లించవచ్చు. అయితే కొన్ని చిన్న బ్యాంకుల రూ. 25000మాత్రమే అనుమతిస్తున్నాయి. పెద్ద బ్యాంకులైతే రోజువారీ యూపీఐ రూ.1లక్షవరకు చెల్లించవచ్చు. బ్యాంకుకు బ్యాంకుకు పరిమితి మారుతూ ఉంటుంది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకారం.. ఒక యూపీఐ అకౌంట్‌కు అనేక బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం గరిష్టంగా యూపీఐ ద్వారా ఒక రోజుకు లక్ష రూపాయలు మాత్రమే పంపొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిమిట్ రోజుకు రూ.1 లక్ష,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిట్ కూడా రూ.1 లక్ష,కొత్త కస్టమర్లు రూ.5,000 మాత్రమే పంపొచ్చు. యాక్సిస్ బ్యాంక్ పరిమితి రూ.1 లక్ష. బ్యాంక్ ఆఫ్ బరోడా పరిమితి రూ.25,000.ఐసీఐసీఐ బ్యాంక్ అయితే రోజుకు రూ.10,000,గూగుల్ పే ద్వారా అయితే, ఈ లిమిట్ రూ.25,000గా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -