పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అందుకే కొందరు పెళ్లిపై అమితమైన ఆసక్తి కనబరుస్తారు.. మరికొందరేమో పెళ్లి పేరు ఎత్తగానే విపరీతంగా భయపడిపోతుంటారు. అయితే ఇలా పెళ్లిపై భయం పెంచుకోవడం ఒక మానసిక వ్యాధి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనినే గామోఫోబియా అని పిలుస్తారు. ఈ గమోఫోబియా ఉన్నవారికి పెళ్లి పేరు ఎత్తగానే గుండె దడ పుట్టడం, టెన్షన్, కాళ్ళు, చేతులు వణకడం, మాట తడబడడం.. ఇలా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇదొక మానసిక రుగ్మత అని చాలమందికి తెలియకపోవడం వల్ల వారిలో వారే కుమిలిపోతుంటారు. ఇలాంటి వారు పెళ్లి ప్రస్తావన లేకుండా ఒంటరిగా జీవించేందుకే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. .
వీరిలో గామోఫోబియా రావడానికి చాలానే కారణాలు ఉన్నాయి. పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చే కష్టాలను కళ్ళారా చూడడం, లేదా పెళ్లిపై ఎవరైనా నెగిటివ్ గా చెప్పడం విని వారి మదిలో నాటుకుపోవడం, లేదా పెళ్లికి ఫిట్ కాదని వారికి వారే ఫిల్ కావడం.. ఇలా చాలా కారణలే ఉన్నాయి. కాబట్టి ఈ గామోఫోబియా ఉన్నవారు మానసిక వ్యాధి నిపుణులను సంప్రదించడం ఉత్తమం. ఇలాంటి ఫోబియాలకు ప్రత్యేకించి ఎలాంటి వైద్యం లేనందున వారికి వారే ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రయత్నించాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి. పెళ్లి చేసుకుంటే ఎలాంటి లాభాలు ఉన్నాయో కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవాలి. పెళ్లి ఇతరత్రా శుభకార్యాలలో ఎక్కువగా పాలు పొందాలి. పెళ్లిని పాజిటివ్ దృక్పథం తో చూడాలి. పెళ్లి అనేది జీవితంలో ఎంతో ప్రదానమైనదని గ్రహించాలి. ఇలా పాజిటివ్ థింకింగ్ తోనే ఈ గామోఫోబియాను ఎదుర్కోవచ్చని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read:Jagan:’సిద్దం’ తో జగన్ ఊపిరొచ్చిందా?