వీడియో.. రన్‌వేపై ఢీకొనబోయిన విమానాలు!

14
- Advertisement -

అమెరికాలోని చికాగోలో పెను ప్రమాదం తప్పింది. మిడ్‌డే ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లో రెండు విమానాలు రన్‌ వేపై దాదాపు ఢీ కొనబోయాయి. అయితే పైలట్‌ అప్రమత్తతతో తృటిలో ప్రమాదం తప్పినట్లైంది.

మంగళవారం ఉదయం 8:50 గంటల సమయంలో సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ కు చెందిన విమానం (2504) ఒమాహా నుంచి చికాగో మిడ్‌వే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. రన్‌వేపై ల్యాండ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. విమాన చక్రాలు కూడా రన్‌వేకి తాకాయి. ఇక అదే సమయంలో రన్‌వేపై ఓ ప్రైవేట్‌ జెట్‌ ఉన్నట్టుండి విమానానికి అడ్డంగా వచ్చింది. దీన్ని గమనించిన సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ పైలట్‌ వెంటనే అప్రమత్తమై విమానాన్ని టేకాఫ్‌ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Also Read:వీడియో.. ఒకేచోట 7 లక్షల తాబేళ్ల సందడి

- Advertisement -