నిర్భయ దోషి రివ్యూ పిటిషన్‌ కొట్టివేత..

436
sc
- Advertisement -

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ హత్యాచారం కేసులో దోషి అక్షయ్‌ సింగ్‌ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.ఈ కేసులో దోషి అక్షయ్‌ కుమార్‌ సింగ్‌ తనకు విధించిన మరణ శిక్షపై దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.తీర్పుపై సమీక్ష కోరే హక్కు దోషికి ఉండబోదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దోషులకు ఉరిశిక్ష సరైనదని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ ఆర్.భానుమతి, అశోక్ భూషణ్, బోపన్నలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇరు వర్గాల వాదనలు విని ఈ తీర్పును ఈ రోజు మధ్యాహ్నం 1.00 గంటలకు ప్రకటించింది.

ఎలాంటి పరిస్థితుల్లోనూ మరణశిక్ష రద్దు చేయొద్దని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టును కోరారు. ఇలాంటి వ్యక్తికి ప్రాణం పోసినందుకు దేవుడు కూడా సిగ్గుపడతాడు. దోషిపై కనికరం చూపిండానికి కూడా అనర్హుడు. అని మెహతా కోర్టులో వాదించారు. నిర్భయ కేసులో దోషులైన ముఖేష్‌(30), పవన్‌ గుప్తా(23), వినయ్‌ శర్మ(24) దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను సుప్రీం గతంలోనే తిరస్కరించింది.

Nirbhaya Case

ఉరిశిక్షను పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన దోషి అక్షయ్ తరఫున న్యాయవాది ఏపీ సింగ్ వాదనలు వినిపించారు. తన క్లయింట్ కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలు లేవని సుప్రీంకోర్టుకు తెలిపారు. శిక్ష అమలుకు మీడియా, ప్రజలు ఒత్తిడి తీసుకొస్తున్నారని అన్నారు.

The Supreme Court bench has heard arguments of both sides and will be pronouncing its judgment on Akshay Kumar Singh’s review petition at 1 pm.

- Advertisement -