భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. మన దేశంలో జాతీయ బ్యాంకుల్లో అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ అనేది తెలిసిందే… ఖాతాదారులకు నిత్యం కొత్త కొత్త స్కీమ్స్ తీసుకురావడమే కాదు చాలా వరకూ వడ్డీ తక్కువకు రుణాలు ఇవ్వడంలో కూడా దానికి సాటే లేదు.. అయితే ఎస్‌బీఐ బ్యాంకు నిర్ణయాలు కూడా అలాగే ఉంటాయి, ఇప్పటికే ఏటీఎంలను తగ్గించుకునే పనిలో పడుతోంది ఎస్‌బీఐ. అలాగే ఆర్‌బీఐ రూల్స్ ప్రకారం డైలీ విత్ డ్రాయల్ లిమిట్స్ ఏటీఎంలలో తగ్గించారు, ఇప్పడు ఎస్‌బీఐ మరో కొత్త నిర్ణయం అమలు చేయనుంది.
ఇకపై ఎస్‌బీఐ మినిమమ్ బ్యాలెన్స్ రూల్‌ని తొలగిస్తున్నట్లు బుధవారం పేర్కొంది. తాజాగా చేసిన ప్రకటన ప్రకారం ఎస్‌బీఐ ఖాతాదారులు తమ పొదుపు ఖాతాలలో కనీస నిల్వను (మినిమమ్ బ్యాలెన్స్) పాటించాల్సిన అవసరం లేదట. దీంతో.. ఈ బ్యాంక్ ఖాతాదారులకు భారీ ఊరట లభించిందనే చెప్పాలి. అలాగే పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును సంవత్సరానికి 3 శాతంగా నిర్ణయించింది. ప్రస్తుతం ఈ రూల్ బ్యాంక్‌లో ఉన్న 4.51 కోట్ల సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. అలాగే ఎస్‌ఎంఎస్ ఛార్జీలను కూడా మాఫీ చేసింది. దీంతో.. ఎస్‌బీఐ ఖాతాదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.