రూ.2 వేల నోట్లు బంద్.!

595
rs 2000
- Advertisement -

నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు కేంద్రం రూ.2 వేల నోటును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇకపై 2 వేల నోటు కనిపించదు. ఇప్పటికే రూ.2 వేల నోట్ల ప్రింటింగ్ నిలిచిపోయిందని వార్తలు వస్తుండగా.. తాజాగా ఎస్‌బీఐ రూ.2 వేల నోటును నిలిపివేసింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) సూచనల మేరకు ఇక ఎస్బీఐ ఏటీఎంల నుంచి రూ.2 వేల నోట్లను బంద్ చేసినట్లు ఎస్బీఐ వెల్లడించింది. ఇప్పటికే దాదాపు అన్ని ఎస్బీఐ ఏటీఎంల్లో రూ. 2 వేల నోట్లను ఉంచే క్యాసెట్లను తొలగించినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. త్వరలోనే రూ.500 నోటును కూడా ఏటీఎంల్లో ఆపేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

చిన్ననోట్లు మాత్రమే లభ్యం కానుండటంతో వినియోగదారుల సౌకర్యార్థం ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని పెంచే దిశగా బ్యాంకు సన్నాహాలు చేస్తోంది. మెట్రో నగరాల్లో 10 సార్లు,ఇతర ప్రాంతాల్లో 12 సార్లు ఉచితంగా ఏటీఎం నుంచి నగదు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటోంది.

- Advertisement -