నితిన్‌తో సైరా దర్శకుడు..!

769
nithin
- Advertisement -

సైరాతో బంపర్ హిట్ కొట్టారు దర్శకుడు సురేందర్ రెడ్డి. మెగాస్టార్‌ చిరంజీవితో పాన్‌ ఇండియా మూవీని తెరకెక్కించిన సురేందర్‌ రెడ్డి దర్శకుడిగా వంద మార్కులు కొట్టేశాడు. ఇప్పటివరకు యాక్షన్, కామెడీ జోనర్ చిత్రాలను తెరకెక్కించి సక్సెస్‌ సాధించిన సురేందర్‌…సైరా సక్సెస్‌తో తన నెక్ట్స్‌ మూవీపై దృష్టిసారించారు.

నితిన్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నాడు సురేందర్‌ రెడ్డి. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి దీనిని నిర్మించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

సైరా మొదటి రోజు రూ.53 కోట్ల కలెక్షన్లు రాబట్టగా వీకెండ్‌లో కూడా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబట్టింది. ఓవరాల్‌గా రూ.100 కోట్లకు పైగా సాధించి సత్తా చాటింది.

- Advertisement -