అక్కినేని అఖిల్ తన రెండో సినిమాకి రెడీ అయిపోతున్నాడు. తన ఫస్ట్ సినిమా ‘అఖిల్’ ప్లాప్ అవడంతో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రేక్షకులముందుకొస్తున్నాడు అఖిల్. అయితే అఖిల్ రెండో సినిమా పై తన తండ్రి నాగార్జున చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడనేది తెలిసిందే. ఇదే క్రమంలో అఖిల్ రెండో సినిమాపై కేర్ తీసుకున్న నాగార్జున వివిధ కథలు వింటూ.. మొత్తానికి విక్రమ్ కుమార్ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగ్.
అయితే అఖిల్ మొదటి సినిమాలో హీరోయిన్‌గా ‘సాయేషా సైగల్’ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తాజాగా మళ్ళీ అఖిల్ రెండో సినిమాలో కూడా తననే తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికల అవసరం ఉండగా, ఒక కథానాయికగా ‘మేఘ ఆకాష్’ ను ఎంపిక చేసుకున్నారు. రెండవ కథానాయిక కోసం కొంతమంది పేర్లను పరిశీలించి.. చివరికి సాయేషా సైగల్ నే తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇదే విషయంపై సాయేషా ను సంప్రదించగా.. తను కూడా ఆసక్తిని చూపిందని అంటున్నారు.
అయితే భారీ అంచనాలతో విడుదలైన ‘అఖిల్’ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ హీరోయిన్ కి తెలుగు నుంచి మరో అవకాశం రాలేదు. మరి అలాంటిది అఖిల్ సరసన రెండోసారి కూడా షాయేషా నే తీసుకోనున్నారనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఏ హీరోయిన్ అయినా తన ఫస్ట్ సినిమాతోనే ప్లాప్ ని మూటగట్టుకున్న అదే హీరోయిన్, మరో సినిమాలో కనిపిస్తే..ఇక అది కూడా ఫ్లాపేనేమో అన్న ఆలోచన సహజంగానే వచ్చేస్తుంటుంది టాలీవుడ్ జనాలకి.
మరి ఈ సినిమాలో కూడా షాయేషా నే ఫిక్స్ చేస్తే..అందరూ నిజంగానే ఆశ్చర్యపోవాల్సిందేనేమో. మొత్తానికి ఒక సినిమా హిట్ అవడానికి కావాల్సిన బలాలు..కథ,కథనమే గానీ.. క్యారెక్టర్లు చేసేవాళ్ళు కాదని ఈ చిత్ర టీమ్ భావించిందో ఏమో. అందుకే మొదటి జోడీతోనే, రెండవ సినిమాని కూడా పూర్తిచేసి సక్సెస్ ని రుచి చూడాలనుకున్నట్టుంది చిత్రటీమ్.