చైతూ పవర్ పుల్ *సవ్యసాచి*

278
Savyasachi
- Advertisement -

శైలాజారెడ్డి అల్లుడుతో ఈ మద్యే ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని వారబ్బాయి తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చందుమొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సవ్యసాచి చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నాడు. చైతూ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

Savya-Sachi

‘ప్రేమమ్’ చిత్రం తరువాత చందు మొండేటి, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కుతున్నఈ సినిమాపై అభిమానుల‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. స‌వ్య‌సాచి అంటే రెండు చేతుల‌ని స‌మ‌ర్ధ‌వంతంగా, శ‌క్తివంతంగా వాడే వాళ్ళు అని అర్ధం. తాజాగా విడుదలైన ఈ చిత్రం టీజర్‌ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతోంది. ఈ టీజర్‌లో చైతూ నటన చూసిన ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులు సంతోషంతో మురిసిపోతున్నారు. వరుసకు కనిపించని అన్నను.. సవ్యసాచిలో సగాన్ని.. కవచాన్ని“ అంటూ పవర్ ఫుల్ పంచ్ నే వేశాడు చైతూ. అంటే శత్రువు వల్ల ప్రమాదంలో ఉన్న తమ్ముడిని కవచంలా కాసే అన్న కథ ఇదని అర్థం చేసుకోవచ్చు. భూమిక ఈ చిత్రంలో నాగచైతన్యకు అక్కగా నటిస్తోంది.

- Advertisement -