రాహుల్ ద్రవిడ్ కు బీసీసీఐ నోటీసులు.. దేవుడే కాపాడాలన్న గంగూలీ

548
- Advertisement -

టీం ఇండియా మాజీ ఆటగాడు, జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. ద్రవిడ్ పరస్పర విరుద్ద ప్రయోజనాలు పొందుతున్నారని, రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని బీసీసీఐ ద్రవిడ్ కు నోటీసులు పంపించింది. ఈ మేరకు బోర్డు అంబుడ్స్‌మన్-ఎథిక్స్ ఆఫీసర్ రిటైర్డ్ జస్టిస్ డీకే జైన్ మంగళవారం నోటీసులు ఇచ్చారు. ఈవిషయంపై ఘాటుగా స్పందించారు టీంఇండియా మాజీ కెప్టెన్ గంగూలీ.

ఇండియన్ క్రికెట్లో కొత్త ఫ్యాషన్ వచ్చింది. ప్రరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం.వార్తల్లో నిలిచేందుకు ఇది బాగా తోడ్పడుతోంది. ఇండియన్ క్రికెట్ ను దేవుడే కాపాడాలి అంటూ ట్వీట్ చేశారు. గంగూల్ ట్వీట్ పట్ల టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. ఈ వ్యవహారం ఎటు వెళ్తోందో అర్థం కావడం లేదు. ఇండియన్ క్రికెట్ కు ద్రవిడ్ కంటే గొప్ప వ్యక్తి దొరకడు. ద్రవిడ్ లాంటి దిగ్గజాలకు నోటీసులు పంపడం వారిని అవమానించడమే అన్నారు.

ద్రవిడ్ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్‌గా ఉంటూనే, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు చెందిన ఇండియా సిమెంట్స్ గ్రూప్‌‌కు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆ కంపెనీకి ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ ఉంది. దీంతో ద్రవిడ్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నాడని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజీవ్ గుప్తా బీసీసీఐకి ఫిర్యాదు చేశాడు. దాంతో ఫిర్యాదుపై స్పందించాలని ద్రవిడ్‌కు నోటీసులు జారీ చేశారు.

Ganguly Twitter

- Advertisement -