ఐపీఎల్‌లో ముగిసిన చెన్నై కథ..!

13
mi

ఐపీఎల్‌ 15వ సీజన్‌లో చెన్నై కథ ముగిసింది. చావోరెవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ముంబై చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. చెన్నై విధించిన 98 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి 14.5 ఓవర్లలో 103 పరుగులు చేసి విజయం సాధించింది ముంబై. తిలక్‌ వర్మ (34),రోహిత్ శర్మ (18), హృతిక్‌ షోకీన్‌ (18), టిమ్‌ డేవిడ్ (16) రాణించారు.

ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన చెన్నై 97 పరుగులకే చాపచుట్టేసింది.రుతురాజ్ గైక్వాడ్ 7,కాన్వే 0,మొయిన్ 0,ఉతప్ప 1,రాయుడు 1తో నిరాశపర్చగా ధోని 36 పరుగులతో రాణించారు. ముంబై బౌలర్లలో సామ్స్ 3,మెరిడిత్ 2,బుమ్రా 1,కార్తికేయ 2 వికెట్లు తీశారు.