కర్ణాటక DyCMగా సతీష్ జార్కి!

7
- Advertisement -

కర్ణాటక రాజకీయాల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా కేపీసీసీ అధ్యక్షుడు..ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైంది. శనివారం సాయంత్రం 4 గంటలకు విధానసభలో జరిగే కాంగ్రెస్ శాసనసభా పక్షం (CLP) సమావేశంలో ఎమ్మెల్యేలు అధికారికంగా ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకోనున్నారు.

ఈ క్రమంలో జూన్ 3వ తేదీన డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. సిద్ధరామయ్య రాజీనామా తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.. ఇందులో ఎలాంటి సందేహం లేదు. హైకమాండ్ ఇప్పటికే ఈ నిర్ణయాన్ని ప్రకటించింది.. సిద్ధరామయ్య కూడా దీనిని ధృవీకరించారు అని ఆ పార్టీ నేతలు తెలిపారు.

సిద్ధరామయ్య హయాంలో జరిగిన మంచి పనులను కొత్త సీఎం కూడా ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సతీష్ జార్కిహోళికి డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సిద్ధరామయ్యకు హైకమాండ్ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ ఆయన దానిని సున్నితంగా తిరస్కరించారని.. రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటూ 2028 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను మళ్లీ అధికారంలోకి తేవడమే తన లక్ష్యమని చెప్పినట్లు జార్కిహోళి వెల్లడించారు. సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రను క్యాబినెట్‌లోకి తీసుకోవాలా వద్దా అనే అంశంపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.ప్రజల ఫిర్యాదులు స్వీకరించిన సిద్ధరామయ్యముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ సిద్ధరామయ్య శనివారం తన కావేరి నివాసంలో ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలను వింటూ అర్జీలను స్వీకరించారు.

Also Read:వెనక్కి తగ్గిన ‘పెద్ది’ నిర్మాతలు!

- Advertisement -