ఖుష్బూ ఇంట పెళ్లి భాజాలు..

5
- Advertisement -

ప్రముఖ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఇంట త్వరలోనే పెళ్లి వేడుకలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఖుష్బూ..ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు సుందర్ సి ల పెద్ద కుమార్తె అవంతిక వివాహం శ్రవణ్ శ్రీనివాసన్‌తో నిశ్చయమైంది. ఈ నేపథ్యంలో ఖుష్బూ కుటుంబ సభ్యులు దేశ రాజధాని ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

కాబోయే కొత్త జంట అవంతిక, శ్రవణ్ శ్రీనివాసన్‌లను తీసుకుని ఖుష్బూ, సుందర్ సి దంపతులు ప్రధాని మోదీ నివాసానికి వెళ్లారు. తమ కుమార్తె వివాహ మహోత్సవానికి రావాల్సిందిగా కోరుతూ ప్రధానికి శుభలేఖను అందజేసి అధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాబోయే వధూవరులను ఆత్మీయంగా పలకరించి, వారిని ఆశీర్వదించారు.

ప్రధాని మోదీతో భేటీ అయిన క్షణాలను ఖుష్బూ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మా కుటుంబం కోసం సమయాన్ని కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు… మా పిల్లలు అవంతిక, శ్రవణ్‌లను ఆయన మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అంటూ ఆమె రాసుకొచ్చారు. ప్రధానితో దిగిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఖుష్బూ ఇంట పెళ్లి వేడుకల విశేషాలు తెలుసుకున్న ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also Read:వెనక్కి తగ్గిన ‘పెద్ది’ నిర్మాతలు!

- Advertisement -