మొక్కలు నాటిన సత్యం మాస్టర్

374
sathyam master

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా శేఖర్ మాస్టర్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు వెంకటగిరి లోని తన నివాసంలో మొక్కలు నాటారు ప్రముఖ డాన్సు మాస్టర్ సత్యం మాస్టర్.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని వాతావరణ కాలుష్యం నియంత్రణ కోసం భాద్యతగా మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యుడు సంతోష్ కి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్; గాయకుడు రవి మండవ; యాంకర్ ఇందు లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.