నిలకడగా ఎస్పీ బాలు ఆరోగ్యం!

156
SP Balu doing a special role in Devadas

కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్ధితిపై ఆయన కుమారుడు ఓ వీడియోని రిలీజ్ చేశారు.

బాలసుబ్రమణ్యం ఆరోగ్యం కుదుటపడుతుందని…ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టిందని తెలిపారు. కొద్దిరోజులుగా ఆయనకు అందిస్తున్న ఫిజియో థెరఫీ చికిత్స కూడా మెరుగైన ఫలితాలను ఇచ్చినట్టు సమాచారం.

ఆగస్టు 5న చెన్నై లోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చేరారు బాలు. అప్పటినుండి ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్సను అందజేస్తున్నారు.