అభివృద్దికి.. పరిశుద్యానికి.. ఎప్పూడు ముగింపు ఉండదు. ఎంత చేసిన ఇంకా ఉంటుంది అన్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఖమ్మం జిల్లా పట్టణ ప్రగతిలో భాగంగా సత్తుపల్లి పట్టణంలో పట్టణ ప్రగతిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం లోనే పరిశుభ్రతలో సత్తుపల్లి మొదటి స్థానంలో ఉంది. గ్రామాలల్లో పల్లే ప్రగతి కార్యక్రమం లేకపోతే ఇంత ప్రగతి సాద్యం అయ్యేది కాదని అన్నారు.
మునిసిపల్ ఎన్నికలల్లో…. సత్తుపల్లి లో 23 కి 23 వార్డులు గెలిచాం. ఖాళీ ప్లాట్‌లల్లో చెత్త లేకుండా చూశాం,ఖాళీ ప్లాట్ లల్లో చెత్త వేస్తే యాజమానుల నుండి ఫైన్ విదించాలి. పట్టణ ప్రగతి అంటే ఎవ్వరో కోసం కాదు అవార్డుల కోసం కాదు. సత్తుపల్లి పరిశుభ్రత కోసం ప్రజలు ఆరోగ్యం గా ఉండాలని ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలని ఎమ్మెల్యే కొరారు.
ప్లాస్టిక్‌ను వాడకుండ జూట్ బ్యాగ్ లను వాడాలని,ప్లేక్సిలను ఏర్పాటు చెయ్యకపోయిన మేమ్ ఎమ్ అనుకోం..సత్తుపల్లిని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తిర్చిదిద్దుకోవాలి. సత్తుపల్లి లో 35 కోట్ల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణలు చెపడుతున్నాం. అలాగే సత్తుపల్లి అటవీశాఖ భూమిలో 250 హెక్టార్లలో పార్క్ రాబోతుందని తెలిపారు.
అటవీశాఖకు ప్రత్యన్మయ భూమిని ఇచ్చి జామాయిల్ వేసిన అటవీశాఖ భూమిని పేద ప్రజల ఇళ్ళ స్థలాలు కేటాయించాలని కేసిఆర్‌ను కొరాం.. అదేవిధంగా సత్తుపల్లి నుండి వీ.ఎం.బంజర్ వరకు 9 కోట్ల రూపాయాలతో రహాదారిని నిర్మిస్తాం.వెంగళరావు పార్క్ ను ఖమ్మం పట్టణంలో ట్యాంక్ బండ్ కంటే సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పేర్కొన్నారు.