ఎలక్ట్రిక్ వాహనాలతో పర్యావరణ పరిరక్షణ..

300
minister jagadeesh
- Advertisement -

పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యపేటలోని శాంతి నగర్‌లో ఎలక్ట్రికల్ వాహనాలను ఉత్పత్తి చేసే వర్కస్ ఆటో మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆయన… టీఎస్ ఐపా స్ ద్వారా ఎలక్ట్రిక్ వాహన ఉత్పత్తి పరిశ్రమ ను సూర్యాపేట లో నెలకొల్పడం శుభపరిణామం అన్నారు.

పర్యావరణ పరిరక్షణలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. స్కూల్ కు వెళ్లే పిల్లల కు ఈ వాహనాలు ఎంతో అనుకూలం అని..రిజిస్ట్రేషన్, లైసెన్స్ అవసరం లేని వాహనాలను ప్రజలకు, గృహిణులకు పూర్తి వినియోగ యోగ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదారి కిషోర్ కుమార్, ఎండి జలగం నవీన్, వేమిరెడ్డి రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -