సార్కే చూనర్ తేరి సార్కే..వివాదంపై రక్షిత!

2
- Advertisement -

కేడీ..ది డెవిల్ చిత్రంలోని “సార్కే చూనర్ తేరి సార్కే” పాటపై వివాదం మరింత ముదిరింది. ఈ పాటలో అసభ్యకర పదాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో పలువురు ప్రముఖులు విమర్శించారు. సంజయ్ దత్, నోరా ఫతేహీ నటించిన ఈ పాటపై గాయకుడు ఆర్మన్ మాలిక్, కంగన రనౌత్, దర్శకుడు ఓనిర్ విమర్శలు చేశారు.

అలాగే ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్, జాతీయ మానవ హక్కుల సంఘం కూడా నోటీసులు జారీ చేసి పాటపై నిషేధం విధించాలని కోరాయి.

ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రేమ్ భార్య, మాజీ నటి రక్షిత స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె మాట్లాడుతూ, గతంలో వచ్చిన “పీలింగ్స్”, “డ్రీమమ్ వేకప్‌మ్”, “చోలి కే పీచే” వంటి పాటలు విడుదలైనప్పుడు ఎవరూ ప్రశ్నించలేదని, ఇప్పుడు ఒక్క పాటపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం ఎందుకని ప్రశ్నించారు.

ఒకే పాట ఆధారంగా రచయిత, లిరిసిస్ట్ మొత్తం కెరీర్‌ను తప్పుపట్టడం సరైంది కాదని ఆమె అన్నారు. విమర్శించే హక్కు ఉన్నప్పటికీ, దూషించడం మాత్రం తగదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పాటపై ఫిర్యాదు కూడా నమోదైంది. ఇందులో అసభ్యకర, లైంగిక సూచనలతో కూడిన పదాలు ఉన్నాయని, చిన్నారులకు కూడా సులభంగా అందుబాటులో ఉండటం ఆందోళనకరమని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Also Read:మొక్కజోన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన

చివరగా రక్షిత, అభిమానులు సహనం పాటించాలని, చివరకు సరైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

- Advertisement -