హార్ముజ్…బంకర్ బస్టర్ బాంబులతో అమెరికా దాడి

4
- Advertisement -

హార్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా సైన్యం భారీ వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం. ఈ దాడుల్లో సుమారు 5,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించినట్లు వెల్లడించారు. ఈ చర్యలు ఇరాన్ తీరప్రాంతాల్లో ఉన్న ఆయుధ నిల్వలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని నిర్వహించబడినట్లు అమెరికా వర్గాలు పేర్కొన్నాయి.

ఈ దాడి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీసింది. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ .. నాటో మరియు ఇతర మిత్రదేశాలు హార్మూజ్ జలసంధికి యుద్ధ నౌకలను పంపేందుకు నిరాకరించాయని ప్రకటించిన కొద్ది గంటలకే ఈ దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనితో అమెరికా స్వతంత్రంగా సైనిక చర్యలు చేపడుతున్నదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

హార్మూజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటి. ఇక్కడ ఉద్రిక్తతలు పెరగడం గ్లోబల్ ఆయిల్ సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా చర్యలపై వివిధ దేశాలు స్పందిస్తున్నాయి.

ఇరాన్ ఈ దాడిపై తీవ్రంగా స్పందించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ భద్రతా పరిస్థితులపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.

Also Read:మొక్కజోన్న రైతుల కోసం బీఆర్ఎస్ ఆందోళన

- Advertisement -