‘స‌ర్కారు వారి పాట’కు కరోనా షాక్‌..

101
Sarkaru-Vaari-Paata
- Advertisement -

కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో సినిమా షూటింగులకు ఆటంకాలు కలుగుతున్నాయి. రోజు రోజుకూ కొవిడ్‌-19 కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో… ముందు జాగ్రత్తగా, ఎందుకైనా మంచిదని షూటింగులను వాయిదా వేస్తున్నారు కొందరు. తాజాగా మ‌హేష్ బాబు సర్కారు వారి పాట సెట్‌లోను కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్‌లో చిత్ర షూటింగ్ జ‌రుగుతుండ‌గా, యూనిట్‌లో కీలక వ్యక్తి ఒకరు కరోనా బారిన పడటంతో వెంటనే చిత్రీకరణ నిలిపివేశారు. చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న వారంద‌రికి ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ నెలాఖ‌రున మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తుంది.

ప‌ర‌శురాం తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం సామాజిక నేప‌థ్యంలో క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా తెర‌కెక్కుతుండ‌గా, ఇప్ప‌టికే ఈ చిత్రం దుబాయ్‌లో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంది. ఇక రీసెంట్‌గా క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ రెండో షెడ్యూల్ మొద‌లు పెట్టారు.షూటింగ్ మొద‌లైన నాలుగు రోజుల‌కే చిత్రీక‌ర‌ణ ఆపేశారు.

- Advertisement -