దేశంలో క‌రోనా విజృంభ‌ణ.. కొత్త‌గా 2,73,810 కేసులు..

146
corona
- Advertisement -

దేశంలో క‌రోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతుంది. వీటికి సంబంధించిన వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం… గత 24గంటల్లో కొత్త‌గా 2,73,810 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,50,61,919 కు చేరింది. అదే సమయంలో 1,44,178 మంది కోలుకున్నారు.

గత 24 గంట‌ల సమయంలో 1,619 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,78,769 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,29,53,821 మంది కోలుకున్నారు. 18,01,316 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 12,38,52,566 మందికి వ్యాక్సిన్లు వేశారు.

- Advertisement -