రాష్ట్రంలో కొత్తగా 4,009 కరోనా కేసులు..

37

తెలంగాణలో కరోనా రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24గంటల్లో 4,009 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 1,878 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,55,433కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,14,441 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,838గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 39,154 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 705 మందికి క‌రోనా సోకింది.