సర్కారు వారి పాటకు తప్పని లీకుల బెడద..!

20
mahesh

మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇందులో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

తాజాగా సినిమాకు సంబంధించి అప్‌డేట్ వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో అత్యధిక భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతేండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఇటీవలే తాజా షెడ్యూల్ స్టార్ట్ చేసింది. అయితే సినిమాకు సంబంధించిన వార్తలు లీక్ అవుతుండటం పట్ల మహేశ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట.

సినిమా కథ విషయాన్ని సస్పెన్స్ గా ఉంచారు కాబట్టి ఈ లీకులు ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని తగ్గించేస్తాయని ఆయన భావిస్తున్నారట. ప్రొడక్షన్ హౌస్ సెట్స్ లో జాగ్రత్తగా ఉండాలని, అలాగే కఠినంగా ఉండాలని మహేష్ హెచ్చరించారని సమాచారం. మరి ఇప్పటికైనా సర్కారు వారి పాట లీకులు ఆగుతాయో లేదో వేచిచూడాలి.