మా ఎన్నికలు..మరోసారి మంచు విష్ణు హాట్ కామెంట్స్‌!

180
manchu

మా ఎన్నికల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే సాధారణ ఎన్నికలను తలపించేలా మా ఎన్నికలు మారగా మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశారు మంచు విష్ణు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విష్ణు…మూవీ ఆర్టిస్ట్ ల మధ్య యూనిటీ లేదని … గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దాసరి నారాయణరావు చెప్తే అందరూ విన్నారని, దాసరి పోయాక ఇండస్ట్రీలో కొరత ఏర్పడిందన్నారు.

మా భవనం అనేది తన ప్రధాన ఎజెండా కాదని, ఆర్టిస్టులకు సంబంధించిన సమస్యలు, ప్రొడక్షన్ సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఆర్టిస్టుల సంఘం అధ్యక్షులు తెలుగు వాళ్లు కావాలని తాను అనలేదని, కానీ మెంబర్లు కాని వాళ్లు మాత్రం పోటీ చేయొద్దని వెల్లడించారు. మెంబర్లు కాని వాళ్లకు సినీ పరిశ్రమలో అవకాశాలు ఇవ్వకూడదు అని ప్రకాశ్ రాజ్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

అధ్యక్ష పదవిలో ఉన్నా లేకపోయినా మా భవనాన్ని నిర్మిస్తానని, దానికి బాలయ్య కూడా సాయం చేస్తాను అన్నాడని చెప్పుకొచ్చారు. గతంలో జైలుకెళ్లాల్సిన కొంతమందిని ఎవరు కాపాడారో వాళ్ళని అడిగితేనే తెలుస్తుందని, వాళ్ళు శృతి మించితే పేర్లు బయట పెట్టాల్సి వస్తుందని గట్టిగా హెచ్చరించారు విష్ణు.