దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మాణ సంస్థ ఆర్కే టెలీ షో స్థాపించి 25 ఏళ్లవుతున్న సందర్భంగా హైదరాబాద్ లో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయని సునీత కుమారుడు ఆకాష్ ను హీరోగా పరిచయమవుతున్న‘‘సర్కారు నౌకరి’’ సినిమా టీజర్ విడుదల చేశారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భావనా వళపండల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్కే టెలీ షో 25 ఏళ్ల వేడుకలో నిర్మాతలు సురేష్ బాబు, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, టీజీ విశ్వప్రసాద్,ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
నిర్మాత డి.సురేష్ బాబు మాట్లాడుతూ – నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రాఘవేంద్రరావు గారికి కంగ్రాట్స్ చెబుతున్నా. ఆర్కే టెలీ షో ద్వారా ఆయన రాజమౌళి లాంటి ఎంతోమందికి ఆయన బ్రేక్ ఇచ్చారు. అందులో ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు. మీ టీమ్ అందరికీ నా విశెస్ చెబుతున్నా. అన్నారు.నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ – ఆర్కే టెలీ షో పాతికేళ్లు పూర్తయిన తెలిసినప్పుడు ఆనందపడ్డాను. ఈ సంస్థ ద్వారానే మేము శాంతినివాసం సీరియల్ నిర్మాణం ప్రారంభించాం. ఆ తర్వాత ఆర్కే టెలీ షో ఇచ్చిన ఎక్సీపిరియన్స్ తో ఆర్కా మీడియా స్థాపించాం. రాఘవేంద్రరావు గారికి, మాధవి, పద్మజ,మిగిలిన టీమ్ అందరికీ కంగ్రాట్స్. అన్నారు.ప్రసాద్ దేవినేని మాట్లాడుతూ – రాఘవేంద్రరావు గారి అఛీవ్ మెంట్స్ చూసి గర్వపడుతుంటాం. ఆయనలా ఉండాలని, ఆయనలా లైఫ్ లో సాధించాలని ప్రయత్నిస్తుంటాం. అన్నారు.
దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ – ఆహా ఓటీటీలో నేను పంచతంత్ర కథలు అనే వెబ్ సిరీస్ చేశాను. అది ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది నేను ఊహించలేదు. అయితే ఒకరోజు రాఘవేంద్రరావు గారు ఫోన్ చేసి ఆయన ఆఫీస్ కు రమ్మని పిలిచారు. వెళ్లి కలిస్తే నేను పంచతంత్ర కథలు ఎలా మొదలుపెట్టి ఎలా ఎండ్ చేశానో చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. మనం చేసే ప్రయత్నం నిజాయితీగా ఉంటే అది ఎక్కడికైనా చేరుతుంది అని అర్థమైంది. ఒక లైన్ కథ వినిపిస్తే ఆయన నచ్చింది. వెంటనే మా సంస్థలో చేద్దామని చెప్పారు.నాకు సర్కారు నౌకరి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు రాఘవేంద్రరావు గారికి థాంక్స్ చెబుతున్నా. అన్నారు.
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ – రాఘవేంద్రరావు గారు మాకు ఇన్సిపిరేషన్. ఎన్టీఆర్, చిరంజీవి గారికి నేను అభిమానిని. వాళ్లకు ది బెస్ట్ మూవీస్ ఇచ్చారు రాఘవేంద్రరావు గారు. వాళ్లకే కాదు ఎంతోమంది స్టార్స్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ రూపొందించారు. ఆయన చేసిన డిఫరెంట్ జానర్ మూవీస్ తో చూస్తే సర్కారు నౌకరి భిన్నమైన సినిమా. ఈ సినిమా చూశాను. దీనికి నేషనల్ అవార్డ్ వస్తుంది. అన్నారు.
సింగర్ సునీత మాట్లాడుతూ – రాఘవేంద్రరావు గారి సినిమాల్లో ఎన్నో పాటలు పాడాను. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎమోషనల్ గా ఉంది. ఈ సంస్థలో డబ్బింగ్ చెప్పాం, పాటలు పాడాను, ఇదొక మాకు హోమ్ బ్యానర్ లాంటిది. నంది అవార్డులు సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నా ఇంత ఎమోషనల్ కాలేదు. ఇవాళ ఈ స్టేజీ మీద మాట్లాడటం ఉద్వేగంగా ఉంది. ఆర్కే టెలీ షో టీమ్ అందరికీ నా హార్టీ కంగ్రాట్స్. రాఘవేంద్రరావు గారు మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ సర్కారు నౌకరి సినిమా నిర్మించారు. మీ అబ్బాయి మంచి నటుడే కాదు సంస్కారం,మంచి నడవడిక ఉన్న వ్యక్తి. అతనికి ఫ్యూచర్, కెరీర్ బాగుంటాయని రాఘవేంద్రరావు గారు చెప్పినప్పుడు నా లైఫ్ లో అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది. పిల్లలు ఎదిగితే వచ్చే సంతోషం ఇదే కావొచ్చు. ఈ సినిమాలో నేనొక ప్రమోషనల్ సాంగ్ పాడాను. సర్కారు నౌకరి సినిమా బాగా వచ్చింది. అని చెప్పింది.
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ – రాఘవేంద్రరావు గారు నా ఆల్ టైమ్ ఫేవరేట్ డైరెక్టర్. ఆయన తీసిన వేటగాడు, అడివి రాముడు వంటి ఎన్నో సినిమాలు నన్ను ఇన్స్ పైర్ చేసి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేలా చేశాయి. మీ నిర్మాణ సంస్థ ఆర్కే టెలీ షో పాతికేళ్లు పూర్తైన సందర్భంగా నా కంగ్రాట్స్ చెబుతున్నా. మీ సినిమాలో పాటను లాంఛ్ చేయడం గర్వంగా ఉంది. అన్నారు.
హీరోయిన్ భావన వళపండల్ మాట్లాడుతూ – నేను ఒక కార్పొరేట్ కంపెనీలో సీఏగా నాలుగేళ్లు పనిచేశాను. కానీ నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. డ్యాన్స్ ట్రైనింగ్ తో పాటు థియేటర్ ఆర్ట్స్ లో చేరాను. ఇంట్లో వాళ్లు సినిమాల్లోకి వెళ్తానని భయపడ్డారు. కానీ నాకు సినిమా అవకాశం ఎవరిస్తారు అని అనుకున్నా. అయితే రాఘవేంద్రరావు గారు ఈ సినిమాలో సెలెక్ట్ చేసినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నాలా ఎవరైనా పెద్ద కలలు కనొచ్చని అర్థమైంది. థియేటర్ ఆర్ట్స్ చేస్తున్న నా ఫ్రెండ్స్ కు కూడా హీరోయిన్ కావొచ్చనే హోప్స్ పెరిగాయి. సినిమాపై ఇంకా రాఘవేంద్రరావు గారికి ఇంట్రెస్ట్ తగ్గలేదు. అందుకే మా లాంటి కొత్త టాలెంట్ కు అవకాశాలు వస్తున్నాయి. అని చెప్పింది.
హీరో ఆకాష్ మాట్లాడుతూ – నన్ను హీరోగా పరిచయం చేస్తున్నందుకు రాఘవేంద్రరావు గారికి థాంక్స్. ఆర్కే టెలీ షో 25 ఇయర్స్ సందర్భంగా కంగ్రాట్స్ చెబుతున్నా. నాకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది.ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు అవకాశం ఇచ్చేవాళ్లు కావాలి. అలాంటి ఆఫర్ రాఘవేంద్రరావు గారు ఇచ్చారు. మా దర్శకుడు శేఖర్ సర్కారు నౌకరి సినిమాకు నన్ను నమ్మారు. నేను మా టీమ్ మొత్తానికి థ్యాంక్స్ చెప్పాలి. మమ్మల్ని బ్లెస్ చేసేందుకు ఈ వేడుకకు వచ్చిన పెద్దలందరికీ థాంక్స్. నేను ఈ వేదిక మీద ఉన్నానంటే మా అమ్మ కారణం. ఆమే నాకు సర్వస్వం. అని అన్నారు.
Also Read:ప్రజా గాయకుడు గద్దర్ ఇకలేరు..
రైటర్ బీవీఎస్ రవి మాట్లాడుతూ – రాఘవేంద్రరావు గారు ఆర్కే టెలీ షో ద్వారా ఎంతోమంది కొత్త వాళ్లను పరిచయం చేశారు. ఈ సంస్థలోని టీమ్ అందరికీ కంగ్రాట్స్. ఆయన ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అయ్యేదాకా వదలరు. సర్కారు నౌకరి సినిమా చూశాను. చాలా బాగుంది. ఈ మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ చెబుతున్నా అన్నారు.సంగీత దర్శకుడు శాండిల్య మాట్లాడుతూ – రాఘవేంద్రరావు గారి సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు. మా అమ్మ నన్ను ఈ వేదిక మీద చూసి చాలా సంతోషిస్తుంది. మంచి మ్యూజిక్ చేశాం. సురేష్ బొబ్బిలి గారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. అన్నారు.
సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ – రాఘవేంద్రరావు గారి సినిమాలు చూస్తూ పెరిగాము. ఆయనను కలిసేప్పుడు ఎంతో భయపడ్డా కానీ ఆయనతో మీటింగ్ అయ్యాక..ఈయన ఇంత ఫ్రెండ్లీగా ఉంటారా అనిపించింది. మంచి మనసున్న వ్యక్తి రాఘవేంద్రరావు గారు. ఈ సినిమా చూశాక గొప్ప ఫీల్ కలిగింది. ఆ ఫీల్ తో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేశా. దర్శకుడు శేఖర్ అద్భుతమైన సినిమా చేశారు. ఆకాష్ యాక్టింగ్ చాలా బాగుంది. సర్కారు నౌకరి అనే ఒక మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం. అన్నారు.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ – కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకే ఆర్కే టెలీ ఫిలింస్ స్టార్ట్ చేశాను. మాతో 25 ఏళ్లుగా ప్రయాణం చేస్తున్న టీమ్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. ఈ కార్యక్రమానికి అందర్నీ పిలవాలని అనుకున్నాం కానీ కుదరలేదు. ఈ వేదిక మీదున్న చాలా మంది పెద్ద ప్రొడ్యూసర్స్ నా సినిమాలు చూసి ఇన్స్ పైర్ అయ్యామని చెబుతున్నారు. మీరు చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు చిన్న సినిమాలు చేసి కొత్త టాలెంట్ కు అవకాశాలు ఇస్తే ఇన్నేళ్లుగా నేను చేసిన ప్రయత్నానికి కొనసాగింపుగా ఉంటుంది. మా సంస్థలో ఎంతోమంది యంగ్ టాలెంట్ ఉన్నారు. మీరు చేసే చిన్న సినిమాల్లో వారికి అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
Also Read:అసెంబ్లీ సమావేశాలు పొడగింపు..