సర్కారు నౌకరి..రిలీజ్ డేట్

35
- Advertisement -

ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా “సర్కారు నౌకరి”. ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. “సర్కారు నౌకరి” సినిమా న్యూఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీఎన్ ఆదిత్య, రైటర్ బీవీఎస్ఎన్ రవి, సినిమా టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ – నేను దర్శకుడిగా ఏడాదికి ఏడెనిమిది సినిమాలు చేసిన సందర్భాలున్నాయి. ఇప్పడు ట్రెండ్ మారింది. శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు రెండేళ్లు, మూడేళ్లకు సినిమాలు చేస్తున్నారు. అయినా వారి సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తునే ఉన్నారు. అంటే శేఖర్, అనిల్ ప్రేక్షకుల్ని ఎంతగా తమ దర్శకత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. రొటీన్ ఫార్మేట్ కథలకు భిన్నంగా సినిమాలు చేసి విజయం సాధించవచ్చని శేఖర్ కమ్ముల ప్రూవ్ చేశాడు. ఆయన ఆనంద్, హ్యాపీడేస్ మూవీస్ నాకు ఎంతో ఇష్టం. అనిల్ రావిపూడి పటాస్ తో మొదలై ఇవాళ బాలకృష్ణతో భగవంత్ కేసరి లాంటి సూపర్ హిట్ మూవీ చేశాడు. రేపు మెగాస్టార్ తో సినిమా చేస్తాడు. అతను నాకు ఇష్టమైన దర్శకుడు. నా చేతుల మీదుగా ఎంతో మంది కొత్త నటీనటులను పరిచయం చేశాను. వెంకటేష్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలను ఇంట్రడ్యూస్ చేశాను. వారంతా ఇప్పుడు గొప్ప పొజిషన్ లో ఉన్నారు. “సర్కారు నౌకరి” సినిమాతో పరిచయం చేస్తున్న ఆకాష్ కూడా హీరోగా అలాంటి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో అతని పర్ ఫార్మెన్స్ చూసిన తర్వాత మరే హీరో ఈ కథకు న్యాయం చేయలేడు అనిపించింది. అలాగే హీరోయిన్ భావన నటన మీద ఆసక్తి గల అమ్మాయి. ఆమె నటన చూస్తే మహానటి సావిత్రిలా పేరు తెచ్చుకుంటుంది అనిపించింది. పంచతంత్ర కథలు చూశాక శేఖర్ ను పిలిచి చెక్ ఇచ్చాను. ఆయన షాక్ అయ్యాడు. అవును నువ్వే మా బ్యానర్ లో సినిమా చేస్తున్నావని చెప్పాను. అంత బాగా పంచచంత్ర కథలతో నన్ను ఇంప్రెస్ చేశాడు. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, ఇతర నటీనటులు అందరూ చక్కగా నటించారు. వీఎన్ ఆదిత్య నాకోసం ఈ సినిమా మేకింగ్ లో ఎంతో సపోర్ట్ చేశారు. అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. “సర్కారు నౌకరి” కు మంచి టీమ్ కుదిరారు. మ్యూజిక్ సందీప్ బింబిసార సినిమాకు కీరవాణి దగ్గర పనిచేశాడు. ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. “సర్కారు నౌకరి” మీకు నచ్చుతుంది. థియేటర్స్ లో చూడమని కోరుతున్నా. ఈ సినిమాను నేను ప్రొడ్యూస్ చేశాను. ఒక్క షాట్ కూడా డైరెక్షన్ చేయలేదు. మొత్తం శేఖర్ చేసుకున్నాడు. “సర్కారు నౌకరి” నా తరహా మూవీ కాదు. గతంలో ఇలాంటి కంటెంట్ తో నేనూ సినిమాలు చేశాను గానీ. ఇందులో ఎమోషనల్ గా స్టోరీ వెళ్తుంది. నేను అన్ని మూవీస్ చూస్తాను. అందుకే ఇప్పుడున్న డైరెక్టర్స్ తో పరిచయాలు పెరిగాయి. బాగున్న సినిమాల డైరెక్టర్స్ కు ఫోన్ చేసి మాట్లాడుతుంటా. కమర్షియల్ గా చేసిన అన్ని సినిమాలు ఆడాలని లేదు. వందల మంది ఫైటర్స్ ను హీరో ఒక్కడే కొట్టిన సినిమాలు కూడా ఆదరణ పొందడం లేదు. దర్శకుడిగా నా జీవితంలో పెద్ద తృప్తి ఏంటంటే అన్నమయ్య లాంటి భక్తిరస కథలు సహా అన్ని రకాల సినిమాలు చేయగలిగాను. అన్నారు.

డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ – “సర్కారు నౌకరి” సినిమా ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. ఒక నేచురల్ అట్మాస్పియర్ లో చేసిన సినిమా ఇది. ఆకాష్, భావన, డైరెక్టర్ శేఖర్, సునీత గారికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. న్యూ ఇయర్ రోజున మీ సినిమా రిలీజ్ అవుతోంది. మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు మాకు గురువు లాంటి వారు. ఆయన సినిమాలు చూసి పెరిగి, ఇండస్ట్రీకి వచ్చిన మాకు ఆయన నుంచి చిన్న ప్రశంస దక్కినా అది పెద్ద అఛీవ్ మెంట్ లా భావిస్తాం. మమ్మల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. థ్యాంక్యూ గురువు గారు. రెండేళ్లకు సినిమా చేసినా మా మీద చాలా ప్రెషర్ ఉంటోంది. ఇవాళ ఆడియెన్స్ కు సినిమా నాలెజ్డ్ గా బాగా పెరగడమే కారణం అనుకుంటున్నా. అన్నారు.

Also Read:ఫ్రీ బస్..ఒరిజినల్ ఐడీ లేకుంటే అంతే!

- Advertisement -