‘సరిలేరు నీకెవ్వరు’ నుండి సర్‌ప్రైజ్‌..

462
Sarileru Neekevvaru

మహేశ్‌బాబు రష్మిక మందాన జంటగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ మూవీని దర్శకుడు అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో లేడీ బిగ్‌బాస్‌ విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్‌ రాజు సమర్పణలో జీఎంబీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది.

mahesh

కాగా సూపర్‌స్టార్‌ మహేష్‌ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్‌ డేట్‌ ఈ రోజు వెల్లడి కానుంది. ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు టీజర్‌ తేదీ వెల్లడిస్తామని ప్రకటించి చిత్రయూనిట్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. దీంతో #UnlockSLNTeaserDate, #SarileruNeekevvaruTeaser హాష్‌ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. టీజర్ లోడ్ అవుతోందంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ఇంతకుముందే ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

Mahesh Babu’s upcoming film Sarileru Neekevvaru have unveiled a countdown poster for the teaser date announcement which will be done this evening..