బిగ్ బాస్ 5: దమ్ము కొడుతూ షాకిచ్చిన సరయు..

439
Sarayu Roy
- Advertisement -

గత ఆదివారం బిగ్ బాస్ సీజన్ 5 ప్రారంభమైన సంగతి తెలిసిందే.. ఈ సారి సీజన్ 5లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈసారి కూడా నాగ్ హోస్ట్‌గా చేస్తున్నారు. ఇక ఫస్ట్ డే ఆట పాటలతో సాగిన షో..రెండో రోజు నామినేషన్లతో సాగింది. అయితే షోకు సంబదించిన ఆన్ సీన్ దృశ్యాలను ప్రేక్షకులకు అందజేస్తున్నారు షో మేకర్స్‌. తాజాగా ఆలా విడుదల చేసిన సన్నివేశాల్లో స్మోకింగ్ రూమ్‌లో లోబో, హమీదా ఖాతూన్, సరయు రాయ్ దమ్ము మీద దమ్ము కొడుతూ హౌస్ లోని మిగతా సభ్యుల గురించి మాట్లాడుకున్నారు.

బయట నీ గురించి నాకు తెలియదు. మనకు బాండింగ్ లేదు. కానీ నీ గురించిన ఇన్‌ఫర్మేషన్ నాకు వస్తూ ఉండేది అని సరయు..లోబో గురించి చెప్పుకొచ్చింది. ఇంటిలో అందరితో ఉన్నట్టు.. మీతో మజాక్ చేసినట్టు.. సీనియర్ యాక్టర్ ప్రియతో చేయలేను అని లోబో అంటే.. ఆమె అందరితో కలువదు కూడా అంటూ హమీదా కామెంట్ చేసింది. ఆమెను చూస్తే.. బాండింగ్ కష్టమే అనిపిస్తుంది అని లోబో తెలిపాడు.

ఇక సిగరెట్లు తడిచిపోతాయోమో అంటూ కవర్ చుట్టేస్తూ సరయు అంటే.. ఏం కాదు.. పైన పెట్టేయండి అంటూ లోబో తెలిపాడు. అంతలోనే వాళ్లు దాచేస్తారో ఏమో అంటూ హమీదా అనుమానం వ్యక్తం చేసింది. కాబట్టి ప్యాకెట్‌లో పెట్టుకో అంటూ సరయు లోబోకు ఇచ్చింది. ప్రతీ రోజు వస్తాయో లేదో అంటూ హమీదా అంటే.. ప్రతీ రోజు వస్తాయి అంటూ లోబో చెప్పడం ఆన్ సీన్ వీడియోలో కనిపించింది. మొత్తం మీద ఆన్ సీన్ లలో సభ్యుల తాలూకా చాల విషయాలే బయటపడుతున్నాయని ప్రేక్షకులు అంటున్నారు.

- Advertisement -