బిగ్‌బాస్‌: ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరో తెలుసా..?

93
Bigg Boss Telugu 5

బిగ్‌బాస్‌ అయిదో సీజన్‌లో మొదటి నుంచి ఆసక్తిగా సాగుతోంది. తొలి రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య గొడవలు ప్రారంభయ్యాయి. చిన్నపాటి విషయాలకు గొడవ పడుతూ వివాదానికి దారి తీస్తున్నారు. ఈ క్రమంలో ఫస్ట్‌ వీక్‌ జరిగిన నామినేషన్‌ ప్రక్రియ వాడివేడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లే జాబితాలో జెస్సీ(జస్వంత్‌), రవి, సరయూ, కాజల్‌, మానస్‌, హమీదా ఉన్నారు. తొలివారం, తొలి ఎలిమినేషన్‌ ఎవరు అనేది ఆసక్తిగా మారింది.

ఇంకా ఆదివారం రావడానికి మధ్యలో రెండు రోజులే ఉంది. దీంతో ఏ సభ్యుడు ఇంటి నుంచి బయటకు వెళ్లనున్నాడన్నది సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు మోడల్‌ జెస్సీ(జస్వంత్‌) ఈ వారం ఎలిమినేట్‌ కాబోతున్నాడంటూ సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు అందరి కంటే తక్కువగా ఓట్లు జెస్సీకే వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే మోడలింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచి హౌజ్‌లో అడుగు పెట్టిన జెస్సీ తొలుత అమాయకంగా వ్యవహరించాడు. నామినేషన్‌ ప్రక్రియలో ఏడ్చి సింపతి కొట్టేశాడు. ఆ తర్వాత రాను రాను వివాదాస్పదంగా మారుతున్నాడు. అనీ మాస్టర్‌ అంటే గౌరవం అంటూనే ఆమెతో వాగ్వాదానికి దిగాడు. నిన్న జరిగిన ఎపోసోడ్‌లో ఆమెను కూర్చోనివ్వ‌కుండా కాలు అడ్డుగా పెట్టి దురుసుగా ప్రవర్తించడంతో ఆమె లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకింది. ఈ విషయంలో తప్పు జెస్సీదే అని అందరూ అనడంతో క్ష‌మాప‌ణ‌లు కూడా కోరాడు.

దీంతో నామినేష‌న్‌లో ఉన్న వారిలో జెస్సీ ప్ర‌వ‌ర్త‌నే ప్రేక్ష‌కుల‌కి కాస్త విసుగు తెప్పిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో జెస్సీని ఈ వారం ఎలిమినేట్ చేస్తార‌ని, అందులే డౌటే లేదంటూ ప్రచారం సాగుతోంది. మరి అందరూ భావించినట్టుగానే ఈ వారం జెస్సీ ఎలిమినేట్‌ అవుతాడా? లేదా? తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.