యూఎస్ ఓపెన్‌లో రికార్డు సృష్టించిన ఎమ్మా..

263
Emma Raducanu
- Advertisement -

టెన్నిస్‌ చరిత్రలో పెనుసంచలనం చోటు చేసుకుంది. యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో పద్దెనిమిదేళ్ల ఎమ్మా రుదుకానును విజేతగా ఆవిర్భవించింది. ఈ బ్రిటిష్‌ టెన్నిస్‌ సెన్సేషన్‌.. 19 ఏళ్ల కెనడా ప్లేయర్‌ లేలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్న తొలి క్వాలిఫయర్‌గా రికార్డులెక్కింది ఎమ్మా. 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ సాధించిన తొలి మహిళగా ఎమ్మా రికార్డు సృష్టించింది. అంతకుముందు 1977లో వర్జీనియా వేడ్ తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది.

150వ ర్యాంకర్ అయిన ఎమ్మా 73వ ర్యాంకర్ అయిన లెలాను ఓడించడం గమనార్హం. కాగా, ఈ టోర్నీలో ఎమ్మా తాను ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఒక్క సెట్‌ కూడా ఓడిపోకుండా, పరాజయం పొందకుండా టైటిల్ గెలుచుకోవడం విశేషం. ట్రోఫీతోపాటు ఎమ్మాకు 2.5 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ లభించింది. ఈ గెలుపుతో ఆమె 150 ర్యాంకు నుంచి అమాంతం 23కి ఎగబాకింది. అంటే ఒక్కసారిగా 127 ర్యాంకులు దాటి ముందుకు వెళ్లారు. ఇంతటి ఘన విజయం సాధించిన ఎమ్మా రుదుకానును బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్- II అభినందనలతో ముంచెత్తారు.

- Advertisement -