చార్మినార్‌ వద్ద షాపింగ్ చేసిన బాలీవుడ్‌ నటి ‌..

265
Sara Ali Khan
- Advertisement -

బాలీవుడ్ భామ సారా అలీ ఖాన్ సినిమాల్లోకి రాకముందే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ అమ్మడు బాలీవుడ్‌ హీరో సైఫ్ అలీ ఖాన్ పెద్ద భార్య అమృతాసింగ్ తనయురాలు. ఈ అమ్మడు తెరంగేట్రం చేయడానికంటే ముందే తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమాల్లోకి ఈమె అరంగేట్రం గురించి కొన్నేళ్లుగా ఆసక్తికర చర్చ నడుస్తోంది. చివరికి గత ఏడాదే ఆమె తొలి సినిమా ‘కేదార్ నాథ్’ పట్టాలెక్కింది. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘సింబా’. తెలుగులో వచ్చిన ‘టెంపర్‌’కు ఈ సినిమా రీమేక్‌గా రాబోతోంది.

Sara Ali Khan

ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. రంజాన్‌ పండుగ వస్తున్న సందర్భంగా సారా, తన తల్లి అమృతతో కలిసి చార్మినార్‌ వద్ద షాపింగ్‌ చేశారు. కానీ, వారిని ఎవ్వరూ గుర్తు పట్టలేకపోవడం విశేషం. చార్మినార్‌ దగ్గర సాధారణ మహిళల్లా ఇద్దరూ కలిసి గాజులు కొంటున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

అమృత హిందీలో నటించిన చిత్రాలు తక్కువే. సారాకి కూడా ఇది తొలి చిత్రమే కావడంతో ఆమెకు ముంబయిలో ఉన్నంత పాపులారిటీ ఇక్కడ లేదు. దాంతో అక్కడ వారిని ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు. ‘సింబా’ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 28న ‘సింబా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -