కరోనా వైరస్ వేరియంట్ అప్‌డేట్!

77
covid

ప్రపంచ దేశాలను ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ కలవర పెడుతున్న సంగతి తెలిసిందే. యుకేలో కనుగోన్న ఈ కొత్త స్ట్రెయిన్‌ ఇప్పటికే పలు దేశాలకు విస్తరించగా భారత్‌లో నిన్నటివరకు 20కి చేరుకున్నాయి. తాజాగా ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా ఆ కేసుల‌ను నిర్ధారించారు. పూణెలోని వైరాల‌జీ ఇన్స్‌టిట్యూట్‌లో కొత్త నాలుగు కేసులు, ఢిల్లీలోని ఐజీఐబీలో మ‌రో కేసు న‌మోదు అయ్యింది. అయితే యూకే వేరియంట్‌లో పాజిటివ్ తేలిన 25 మందిని ఐసోలేష‌న్‌లో ఉంచిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది.

అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో రెండో కేసును నమోదైంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ హెడ్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీతో ఆన్‌లైన్ సంభాషణలో దక్షిణ కాలిఫోర్నియాలో దొరికిన ఇన్‌ఫెక్షన్‌ను ప్రభుత్వం ప్రకటించింది.